పాలకొండ: గాయత్రి నగర్‌లో చెత్త కష్టాలు.. 15 రోజులుగా రాని పారిశుద్ధ్య సిబ్బంది.

పాలకొండ వెబ్ న్యూస్
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని గాయత్రి నగర్ వీధిలో పారిశుద్ధ్య లోపంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజులుగా చెత్త సేకరణకు సిబ్బంది ఎవరూ రావడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీధిలో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయేమోనని భయపడుతున్నామని స్థానికులు తెలిపారు. వెంటనే నగర పంచాయతీ అధికారులు స్పందించి, పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజూ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నగర పంచాయతీ ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, తక్షణమే చెత్తను తొలగించి, గాయత్రి నగర్ వాసుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుకుందాం.
- పాలకొండ వెబ్ న్యూస్

Post a Comment

0 Comments