పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ కోట దుర్గమ్మ ఆలయం వద్ద అపరిశుభ్రత

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో..
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, పాలకొండ కోట దుర్గమ్మ ఆలయ సన్నిధిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆలయ పరిసరాలు, పర్యవేక్షణ చక్కగా ఉన్నప్పటికీ, భక్తులు కాళ్లు కడుక్కునేందుకు ఉపయోగించే బోరు వద్ద చెత్తాచెదారం, ఆహార వ్యర్థాలు (నూడుల్స్ వంటివి) పేరుకుపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అమ్మవారి దర్శనానికి ముందు పరిశుభ్రంగా కాళ్లు కడుక్కోవాల్సిన భక్తులు, ఈ అపరిశుభ్ర వాతావరణం కారణంగా అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రత్యేకించి పండుగల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పరిశుభ్రత లోపించడం పట్ల భಕ್ತులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించడం ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.పాలకొండ కోట దుర్గమ్మ ఆలయం వద్ద భక్తులు చెప్పులు భద్రపరచుకునేందుకు స్టాండ్‌ సౌకర్యం లేదు. దీంతో భక్తులు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు ఉంచుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వహణ కమిటీ తక్షణమే స్పందించి, భక్తుల సౌకర్యార్థం సురక్షితమైన చెప్పుల స్టాండ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. News By : BSS prasad

Post a Comment

0 Comments