​వచ్చే ఏడాది రూ.1.50 కోట్లతో ఉపాధి పనులు​రైతులకు మేలు పనులకే ప్రాధాన్యత: సర్పంచ్ తిర్లంగి ఉపేంద్ర కుమార్


​పాలకొండ వెబ్ న్యూస్: ​పాలకొండ మండలం, లుంబూరు గ్రామంలో స్థానిక రామ మందిరం దగ్గర గ్రామ సభను  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తిర్లంగి ఉపేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ​వచ్చే సంవత్సరానికి ఉపాధి హామీ పనుల కోసం సుమారు రూ. ఒక కోటి యాభై లక్షల రూపాయల (రూ.1,50,00,000/-) అంచనా ఎస్టిమేషన్స్ వేయడం జరిగిందని ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేంద్ర కుమార్ తెలిపారు. గ్రామంలో చేపట్టే పనులలో రైతులకు మేలు చేసే పనులను మాత్రమే ముందుగా గుర్తించి వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై గ్రామ సభలో చర్చించారు. ​ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రోజా రమణి, మాజీ సర్పంచ్ రౌతు స్వామిబాబు, కొండు చిన్నం నాయుడు, వంగపండు దుర్గా రావు, ఫీల్డ్ అసిస్టెంట్ రౌతు నారాయణ రావు, సచివాలయం సిబ్బందితో పాటు రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

news by : BSS Prasad

Post a Comment

0 Comments