పాలకొండను జిల్లాగా చేయాలి - సాధన సమితి విజ్ఞప్తి..కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత

పాలకొండ వెబ్ న్యూస్ : శ్రీకాకుళం, అక్టోబర్ 6: జిల్లా ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో పాలకొండ జిల్లా సాధన సమితి ప్రతినిధులు శ్రీకాకుళం  జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను కలిసి విజ్ఞప్తి పత్రం అందజేశారు. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలని లేదా పాలకొండ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరారు. సమితి నాయకులు మాట్లాడుతూ పాలకొండ ప్రాంతం చారిత్రాత్మకంగా, భౌగోళికంగా ప్రాధాన్యం కలిగినదని, పరిపాలనా సౌకర్యాలు, విద్యా-వైద్య సదుపాయాలు  ఉన్నాయని తెలిపారు. జిల్లాగా మారితే ప్రజలకు సేవలు మరింత చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, ట్రెజరర్ సబ్బా నానాజీ, జడ్డు బాలరాజు, బెజ్జిపురం చిన్నం నాయుడు, రాంబోతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి పత్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ లకు అందజేశారు.

News by : BSS Prasad

Post a Comment

0 Comments