శ్రీ కోటదుర్గ అమ్మవారి హుండీల లెక్కింపులో ₹17.98 లక్షల ఆదాయం

పాలకొండ వెబ్ న్యూస్ : అక్టోబర్ 9: 

దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలోని శాశ్వత, తాత్కాలిక హుండీల లెక్కింపులో ₹17,98,058 ఆదాయం నమోదైంది. అదనంగా 20.900 మిల్లీ గ్రాముల  మిక్స్‌డ్ బంగారం, 2 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి.ఈ లెక్కింపు కార్యక్రమం జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎస్. రాజారావు పర్యవేక్షణలో నిర్వహించబడింది. పాలకొండ డివిజన్ తనిఖీదారు ఎస్. రామారావు, దేవదాయ శాఖ సిబ్బంది, ఆలయ అధికారులు, పోలీసు, రెవెన్యూ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి వివి సూర్యనారాయణ తెలిపారు. news by : BSS Prasad

Post a Comment

0 Comments