అక్టోబర్ 2 – మూడు విశిష్ట దినాలు

పాలకొండ వెబ్ న్యూస్:ఈ రోజు అక్టోబర్ 2 భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు.

➡️ గాంధీ జయంతి: దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చూపిన మహానుభావుని స్మరించుకునే రోజు.

➡️ లాల్ బహాదూర్ శాస్త్రి జయంతి: దేశానికి రెండో ప్రధానమంత్రి, "జై జవాన్ – జై కిసాన్" నినాదం ఇచ్చిన లాల్ బహాదూర్ శాస్త్రి గారి జయంతి. ఆయన నిజాయితీ, దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తాయి.

విజయదశమి (దసరా): సత్యం చెడుపై గెలిచిన రోజు. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయం, అమ్మవారి మహిషాసుర మర్ధనం స్మరణ. విద్యారంభం, ఆయుధ పూజలతో ఈ పండుగను దేశమంతా ఘనంగా జరుపుకుంటారు.

ఈ రోజు మనకు సత్యం – అహింస – ధర్మం – ధైర్యం వంటి విలువలను గుర్తు చేస్తుంది.

News by BSS Prasad

Post a Comment

0 Comments