పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి సందర్భంగా ముగింపుకు చేరుకున్నాయి.గురువారం రాత్రి తిరువీధి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. పట్టణ వీధులలో అమ్మవారి ఉత్సవ మూర్తి పంచలోహాలతో అలంకరించి, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, బల్ల వేషాలు, పులివేషాలు, గిరిజన నృత్యాలు, సాముగరిడీల నడుమ ఊరేగింపుని నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు, పట్టణ వాసులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తరలి రానున్నారు. దీంతో పాలకొండ జన సందోహంగా మారనుంది. భద్రతా దృష్ట్యా డి.ఎస్.పి ఎం. రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా క్షణక్షణం పర్యవేక్షణ జరగనుంది. విజయదశమి ప్రత్యేకంగా వాహన పూజలు తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఈ ఉత్సవ ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ, ఆలయ ఈఓ వివి సూర్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. కమిటీ సభ్యులు పల్లా కొండలరావు, గంట సంతోష్ కుమార్ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. News by: BSS Prasad
0 Comments