జీఎస్టీ 2.0 పై విద్యార్థులకు అవగాహన సెమినార్

పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక జూనియర్ కళాశాలలో మంగళవారం ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 పై విద్యార్థులకు అవగాహన సెమినార్ నిర్వహించబడింది. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పైల శంకరరావు మాట్లాడుతూ, "ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానం ద్వారా జీఎస్టీ 2.0 అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుంది. పన్ను భారం తగ్గి పొదుపు పెరుగుతుంది, నిత్యావసరాల ధరలు తగ్గడంతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి" అన్నారు.

కళాశాల ఇన్కమ్ టాక్స్ అధ్యాపకులు ఏ. గిరిబాబు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు, జీఎస్టీ చరిత్రపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. సెమినార్ అనంతరం, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల నుండి స్థానిక ఎలాం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గోవిందరావు, నాగభూషణరావు, రామారావు, విజయకుమార్ నాయుడు, శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. News by. BSS Prasad

Post a Comment

0 Comments