పాలకొండ వెబ్ న్యూస్: విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు మంగళవారం, బుధవారం నడపబడు తున్నాయి. సాలూరు డిపో నుండి 8, పార్వతిపురం డిపో నుండి 10, పాలకొండ డిపో నుండి 12 సర్వీసులు మంగళవారం నడవనుండగా, బుధవారం ప్రతి డిపో నుండి 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఆధారంగా అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేయబడతాయి. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని డిపిటివో పార్వతీపురం మన్యం తెలిపారు.
0 Comments