​నవంబర్ 3 నుంచి ఏపీఆర్‌సెట్ (APRCET) ప్రవేశ పరీక్షలు

​ ​రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ (Ph.D.) ప్రవేశాల కోసం శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీఆర్‌సెట్ (ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్షలు నవంబర్ 3 నుంచి 7 వరకు జరుగుతాయని ఏపీఆర్‌సెట్ కన్వీనర్, పద్మావతి మహిళా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగం ఆచార్యులు ఆర్. ఉష తెలిపారు.​ఈ మేరకు ఆమె సోమవారం సెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 14 కేంద్రాలలో ఈ పరీక్షలు ఆన్‌లైన్ ద్వారా జరగనున్నాయి. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 21 అని ఆమె స్పష్టం చేశారు.​ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వర్సిటీ వెబ్‌సైట్‌లను పరిశీలించవచ్చని కన్వీనర్ తెలియజేశారు.

Post a Comment

0 Comments