పాలకొండ వెబ్ న్యూస్: గాయత్రీ నగర్‌లో 15 రోజులుగా పేరుకుపోయిన చెత్త సమస్యపై వెబ్ న్యూస్‌లో వార్త ప్రచురితమైన వెంటనే, నగర పంచాయతీ కమిషనర్ జేవీఎస్ రత్నరాజు తక్షణమే స్పందించారు. వార్త వెలువడిన రెండు గంటల్లోనే చెత్తను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే వెళ్లి పేరుకు పోయిన చెత్తను తొలగించి, ప్రాంతాన్ని శుభ్రం చేశారు. త్వరితగతిన సమస్యను పరిష్కరించిన యంత్రాంగానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. News by : BSS Prasad
0 Comments