మరకత మహా శివలింగానికి అన్నాభిషేకం

పాలకొండ వెబ్ న్యూస్: అక్టోబర్ 6, 2025

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ శిరిడి సాయి నగర్ లోని శ్రీ శిరిడి సాయిబాబా సమేత సకల దేవత ఆలయంలో సోమవారం సాయంత్రం భక్తి శ్రద్ధల మధ్య అన్నాభిషేకం నిర్వహించారు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, అనగా గౌరీ పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లలితా మహా త్రిపురసుందరి సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారికి భక్తుల స్వహస్తములతో మరకత మహా శివలింగానికి అన్నాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులు వేడివేడి అన్నము ను అభిషేకం చేసి, దీపారాధనలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగింది. అన్నాభిషేకం అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పర్రి  శరత్ మాట్లాడుతూ, గౌరీ పౌర్ణమి రోజున శివార్చన చేయడం పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగజేస్తుందని పేర్కొన్నారు. భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


Post a Comment

0 Comments