పాలకొండ వెబ్ న్యూస్ :తాజాగా వీరఘట్టం మండలంలో తుఫాన్ గాలుల కారణంగా పలు గ్రామాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ శుక్రవారం పర్యటించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు.కంబర గ్రామంలో 380 ఎకరాలలో పడిపోయిన అరటి పంటను ఆయన పరిశీలించారు.
అనంతరం దశమంతుపురం గ్రామంలో 20 ఎకరాల అరటి పంట, నడిమికెళ్ళ గ్రామంలో మరో 20 ఎకరాల అరటి పంట, చిట్టిపులివలస గ్రామంలో 80 ఎకరాల అరటి పంట, 70 ఎకరాల మొక్కజొన్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉద్యానవన, వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతు నష్టాన్ని ఖచ్చితంగా గుర్తించి, వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. సంబంధిత రిపోర్టులను తన కార్యాలయానికి కూడా పంపాలని, ఆ నివేదికలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన నష్టపరిహారం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.నష్టపోయిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను విన్నవించారు.కష్టకాలంలో రైతులకు అండగా ఉంటానని, ఎవరూ నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే నిమ్మక భరోసా కల్పించారు. News by : BSs Prasad.
0 Comments