పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 3
అక్టోబర్ 1,2 తేదీల్లో వచ్చిన తుఫాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో అరటి, మొక్కజొన్న, వరి పంటలకు భారీ నష్టం సంభవించింది. వీరఘట్టం మండలం కంబర, కంబర వలస, చిట్టపూడి వలస, దశమంతపురం తదితర గ్రామాలలో అరటి తోటలు నేలకొరిగాయని, ఒక్కో ఈ పెట్టుబడులు వృథా కావడంతో తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పార్వతీపురం జిల్లాలో 700–800 ఎకరాల అరటి, భామిని మండలంలో 2 వేల ఎకరాల మొక్కజొన్న నష్టపోయిందని, వంశధార నది పొంగి వరి, పత్తి పంటలు కూడా ముంపులో ఉన్నాయని తెలిపారు.ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం అందించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. News by: BSS Prasad
0 Comments