జీఎస్టీ లబ్ధిపై అవగాహన కల్పించాలి : కలెక్టర్

పార్వతీపురం, అక్టోబర్ 3:జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు చేకూరే లబ్ధిపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన జీఎస్టీ ఎగ్జిబిషన్, వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12–18% నుంచి 5%కు తగ్గించిందని కలెక్టర్ తెలిపారు. తగ్గిన ధరలతోనే వస్తువులు విక్రయించేలా దుకాణదారులకు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఈ తగ్గింపు ఎంతో ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు.

News by: BSS Prasad


Post a Comment

0 Comments