సజ్జల ను కలిసిన వైసీపీ నేతలు


పాలకొండ వెబ్ న్యూస్ :  తాడేపల్లి: వైఎస్ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో 17వ వార్డు కౌన్సిలర్, ఉద్యోగుల పెన్షనర్ల విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దుప్పాడ పాపి నాయుడు, జిల్లా అధ్యక్షులు ఎద్దు.లిల్లి పుష్పనాదం పాల్గొన్నారు. పాలకొండ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలాన్ని పెంపొందించేందుకు కష్టపడి పనిచేయాలని సజ్జల సూచించారు. పార్టీ నాయకత్వానికి అనుగుణంగా స్థానిక సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని, కార్యకర్తలతో సమన్వయం అవసరమని ప్రధానంగా చర్చించబడింది. సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.  News by : BSS Prasad

Post a Comment

0 Comments