పాలకొండ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) పాలకొండ మండల శాఖ ఇవాళ పలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సేకరించింది. మండల శాఖ అధ్యక్షులు శాసపు వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి గోగుల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జడ్పీహెచ్ఎస్ హడ్కో, గవర్నమెంట్ హై స్కూల్ పాలకొండ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గొట్టమంగళాపురం సహా తొమ్మిది పాఠశాలల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సంఘ సభ్యులుగా చేర్చుకున్నారు.జి రామ్మోహనరావు, కె పారయ్య, గోరు వెంకటరావు, కె సుధాకరరావు వంటి సబ్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఆర్థిక మరియు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. News By : BSS Prasad
0 Comments