వడమ రోడ్డుపై మూడు అడుగుల గుంతలు – రాకపోకలకు తీవ్ర ఇబ్బంది

పాలకొండ వెబ్ న్యూస్ : నగర పంచాయతీ పరిధిలోని వడమ రోడ్డు పూర్తిగా దెబ్బతిని రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కావ్య ప్రింటర్స్ వద్ద మూడు అడుగుల లోతు గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణి స్తున్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రహదారిని బైపాస్ మార్గంగా ఉపయోగించడంతో మరింతగా దెబ్బతింది. స్థానికులు గత మూడు నెలల క్రితం తమ స్వంత డబ్బుతో చిప్స్ వేసి గుంతలను పూడ్చినప్పటికీ వర్షాల కారణంగా మళ్లీ రోడ్డు పాడై పోయింది. పైగా సమీప కాలువ నుంచి నీరు రోడ్డుపైకి చేరిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పగలు సరే, రాత్రివేళ రాకపోకలు చాలా ప్రమాదకరంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలను సరిచేసి నీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రోడ్డును శాశ్వతంగా పునర్నిర్మించాలని స్థానికులు పాలకొండ మున్సిపల్ అధికారులు మరియు సంబంధిత విభాగాలను విజ్ఞప్తి చేస్తున్నారు. News by : BSS Prasad


Post a Comment

0 Comments