వీరఘట్టం శాంతి ఆశ్రమంలో దివ్యజీవన సత్సంగం

  పాలకొండ వెబ్ న్యూస్ : 5 అక్టోబర్, ఆదివారం. వీరఘట్టం శాంతి ఆశ్రమంలో కర్రి గోపన్న ఆధ్వర్యంలో దివ్యజీవన సత్సంగ సమావేశం జరిగింది. పాలకొండ నుండి శ్రీ ఎన్.వి. రమణ కోటబొమ్మాలి నుండి జీ.మోహన్ రావు ముఖ్య వక్తలుగా పాల్గొని భగవద్గీత, రామాయణ, భాగవతం లోని ముఖ్య ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా ఎన్.వి. రమణ మాట్లాడుతూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి కామం, క్రోధం, లోభం వంటి మూడు మాయా కారణాలను వదలాలి అని, నిరంతరం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. ఎన్.వి. రమణ, కర్రి గోపన్న, జీ.మోహన్ రావు, క. సత్యనారాయణ, నిత్య స్మరణానంద స్వామి, జీ.మోహన రావు వక్తలు ప్రసంగించారు.కార్యక్రమం అనంతరం నారాయణ సేవ కూడా నిర్వహించబడింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. News by: BSS Prasad

Post a Comment

0 Comments