రేగిడి శ్రీ సత్యసాయి మందిరంలో వ్రతాలు నిర్వహణ

రేగిడి శ్రీ సత్యసాయి మందిరంలో వ్రతాలు నిర్వహణ


పాలకొండ వెబ్ న్యూస్:రేగిడి, 11 అక్టోబర్ 2025: రేగిడి గ్రామంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఈరోజు శ్రీ సత్యసాయి వ్రతాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వ్రతాలను ధర్మకర్త మామిడి వేణుగోపాల్ నాయుడు  సహాయంతో, విశాఖపట్నం వాసీ  ఎమ్ ఎస్ ప్రకాశ్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

పాలకొండ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి  ఎన్వీ రమణ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, శరీరాన్ని కోల్పోవడం మినహాయించి, జీవితంలోని ఇతర కోల్పోళ్లను తిరిగి సంపాదించవచ్చని గుర్తు చేశారు. ప్రతి మానవుడు “నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఏం చేయాలి?” వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనేది ఆధ్యాత్మిక మార్గమే ప్రధాన మార్గమని వివరించారు. శ్రీ సత్యసాయి బాబా చెప్పిన సూక్తులను వివరిస్తూ మానవుడి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడే సందేశాలు ఇచ్చారు.

అనంతరం ధర్మకర్త మామిడి వేణుగోపాల్ నాయుడు ప్రసంగించారు. కార్యక్రమంలో పరిసర గ్రామాల భక్తులు, కన్వీనర్ లావేటి విష్ణు మామిడి శివప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమం నారాయణ సేవతో ముగిసింది.


Post a Comment

0 Comments