సత్య ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్

పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 11: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే పైడి శ్రీరామమూర్తి కుమారుడు పైడి సత్యప్రసాద్ ఢిల్లీలో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని పాలకొండకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాలకొండకు వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యప్రసాద్ సత్ప్రవర్తన అందరికీ ఆదర్శమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బూర్జ బెజ్జిపురపు రామారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ వావిలపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. News by: BSS Prasad

Post a Comment

0 Comments