పాలకొండలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ

        పాలకొండ వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రారంభమైన కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు  పాలవలస విక్రాంత్ శనివారం పాలకొండలో శాసన మండలి సభ్యుల కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం వ్యాపారం కాదు. మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు నష్టపోతారుఅని పేర్కొన్నారు. 
      ఈ కార్యక్రమంలో  వెలమల మన్మధరావు,  కణపాక సూర్య ప్రకాష్,,  ఎద్దు లిల్లీ పుష్పనాధం,  దుప్పాడ పాపినాయుడు, తుమ్మగుంట శంకరరావు, పల్లా భాను,  తూముల లక్ష్మణ,  తిర్లింగి ఉపేంద్ర,  వైశ్యరాజు గోవిందరాజు,  లోలుగు విశ్వేశ్వరరావు,  శివ్వల శ్రీనివాసరావు,  బలగ మన్మథరావు,  యస్. గురివి నాయుడు , వంజరాపు కొండలరావు,  జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments