​మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శ్రీకాకుళంలో ఘన స్వాగతం

పాలకొండ వెబ్ న్యూస్:/​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ పిఏసీ (PAC) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు  శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు.
​జిల్లాలోని సింహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు ప్రత్యేకంగా మంత్రివర్యులను పుష్పగుచ్ఛంతో, శాలువాతో సన్మానించారు.

జిల్లాకు వచ్చిన మనోహర్ ని ఆహ్వానించేందుకు గర్భాన సత్తిబాబు ఉమ్మడి జిల్లా జనసేన నాయకులతో కలిసి తరలివచ్చారు.​ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారి రాక జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు శాఖాపరమైన సమీక్షలు, జనసేన ముఖ్య నాయకులతో సమావేశాల కోసం పయనించారు. news by: BSS Prasad

Post a Comment

0 Comments