పాలకొండలో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్య అధికారి తనిఖీ

పాలకొండ వెబ్ న్యూస్ :  జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి వై. నాగేశ్వరరావు డివిజన్ కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. యూనిట్ పరీక్షలను పరిశీలించి, ప్రథమ సంవత్సరంలో పరీక్షల్లో జరిగిన మార్పులను విద్యార్థులకు తెలియజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం కొరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం అమలును పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం నాణ్యతను పాటించాలని నిర్వాహకులకు తెలియజేశారు. అడ్మిషన్ రిజిస్టర్లను తనిఖీ చేసి, చేరిన ప్రతి విద్యార్థి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ వేమూరు హరగోపాల్, ఎన్ఎస్ఎస్. పిఓ వెలమల అప్పారావు, గేదెల గోవిందరావు, ఇతర అధ్యాపకులు ఉన్నారు. News by :BSS Prasad


Post a Comment

0 Comments