అంపిలి గ్రామంలో రీసర్వే కార్యక్రమం ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్: అంపిలి గ్రామంలో రీసర్వే కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ముందుగా గ్రామ సభను నిర్వహించారు, గ్రామ వాసులను సమావేశం చేసి రీసర్వే ఉద్దేశ్యాన్ని వివరించారు.తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ – “రీసర్వే కార్యక్రమంలో రైతులు తమ భూముల వివరాలను నిజంగా, స్పష్టంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమైనది.

సహకారం చూపితే సర్వే సమర్థవంతంగా పూర్తవుతుంది” అని వ్యవసాయ దారులకు  సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎమ్ పి పి వాకముడి అనిల్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు, గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు, ఆర్ఎస్డిటి సన్యాసిరావు, వీఆర్వో బంకిరాజా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. రీసర్వే ద్వారా భవిష్యత్తులో భూ సంక్షేమం, వ్యవసాయ రుణాలు, సొంత హక్కులు తదితర అంశాల్లో స్పష్టత ఏర్పడనుందని అధికారులు తెలిపారు. News by: BSS Prasad





Post a Comment

0 Comments