పాలకొండ వెబ్ న్యూస్: వాటపాగు, అక్టోబర్ 3
శ్రీ సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో దివ్యజీవన సత్సంగ సమావేశం శుక్రవారం వారాడ చిన్నంనాయుడు సమన్వయంతో జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శ్రీకాకుళానికి చెందిన పడాల ప్రసాద్ పాలకొండకు చెందిన ఎన్వీ. రమణ పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.
ఎన్వీ. రమణ మాట్లాడుతూ – “ఈ కలియుగంలో మానవునికి సర్వసంపదలు ఉన్నా శాంతి, ఆనందం మాత్రమే లేవు. అవి భగవంతుని దగ్గరే లభిస్తాయి. ఈ రెండింటి కోసమే భగవంతుని ధ్యానం చేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చేసినవన్నీ సేవా కార్యక్రమాలే. అందువల్ల మనమూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటేనే మానవుడు ఉన్నత స్థితికి చేరుకోగలడు” అని సందేశమిచ్చారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. News by: BSS Prasad
0 Comments