గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సిబ్బంది నియామకం కోసం సి.ఐ.టి.యు డిమాండ్

 
పాలకొండ వెబ్ న్యూస్:
మన్యం జిల్లా, అక్టోబర్ 3 గిరిజన స్త్రీ శిశు శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గతంలో ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని (ఏఎన్ఎం) నియమిస్తామని హామీ ఇచ్చి, మొదటి సంతకాన్ని కూడా పెట్టారు. అయితే, రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ హామీ అమలు కాలేదు అని పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ప్రధాన కార్యదర్శి వై. మన్మధరావు తెలిపారు.

“గిరిజన ప్రాంత ఆశ్రమ పాఠశాలల్లో జ్వరము, దగ్గు, ఇతర అనారోగ్యాల సమయంలో పిల్లలకు సక్రమమైన వైద్య సేవ అందించాలంటే ఏఎన్ఎం సిబ్బందిని వెంటనే నియమించాలి. గతంలో ఈ సిబ్బంది పిల్లల ఆరోగ్యాన్ని చూసి, అవసరమైతే జిల్లా ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేసేవారు” అని అన్నారు.కార్యక్రమంలో సి.ఐ.టి.యు జిల్లా బేరర్స్ గొర్ల వెంకటరమణ, బివి రమణ, ఎన్ వై నాయుడు, వి.ఇందిరా పాల్గొన్నారు.News by: BSS Prasad



Post a Comment

0 Comments