పాలకొండ తహశీల్దార్ కార్యాలయం జలమయం: మరమ్మతులకు కలెక్టర్ దృష్టికి


పాలకొండ వెబ్ న్యూస్ కళాభారతి న్యూస్ , అక్టోబర్ 28 (న్యూస్): తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పాలకొండ తహశీల్దార్ కార్యాలయం తడిసి ముద్దయింది. భవనం శిథిలావస్థకు చేరడంతో, తాసిల్దార్ ఛాంబర్‌తో పాటు కార్యాలయం మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఈ పరిస్థితిని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి పరిశీలించారు. కార్యాలయంలో వర్షపు నీరు నిలిచి ఉన్న తీరును గమనించిన ఆయన, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యాలయ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన తాసిల్దార్, భవనం మరమ్మతుల విషయంపై తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.శిథిలావస్థకు చేరిన తాసిల్దార్ కార్యాలయం తక్షణ మరమ్మతులకు నోచుకోవాలని ఉద్యోగులు, స్థానికులు కోరుతున్నారు.
  News by : BSS Prasad

Post a Comment

0 Comments