వెదర్ బ్రేకింగ్ అప్‌డేట్

పాలకొండ వెబ్ న్యూస్ వెదర్ బ్రేకింగ్ అప్‌డేట్ :వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నం నుంచి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ వాయుగుండం ఈ అర్ధరాత్రి గోపాల్‌పూర్ – ఒడిశా తీరానికి దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లో వర్షం, గాలుల తీవ్రత పెరగవచ్చని సూచించింది.

Post a Comment

0 Comments