""సాధిద్దాం పాలకొండ జిల్లాగా""

 ""సాధిద్దాం పాలకొండ జిల్లాగా""

సాధిద్దాం… సాధిద్దాం…

పాలకొండ డివిజన్ను జిల్లాగా సాధిద్దాం!

కలమెత్తి గళమెత్తి మన కోరికను వెలుగెత్తి

సాధిద్దాం… సాధిద్దాం…

పాలకొండ డివిజన్ను జిల్లాగా సాధిద్దాం!!


ప్రజా గొంతు గీతం ఇది, ధైర్య ధ్వని ఇది,

న్యాయానికే మార్గం ఈ ఏకతా గీతం!

రాజ్యాంగమే చెబుతోంది – ప్రజా గొంతు దివ్యం అని,

మన హక్కు మన గళమే – ఇది చరిత్ర లిఖనం!

కలమెత్తి గళమెత్తి మన కోరికను వెలుగెత్తి

సాధిద్దాం… సాధిద్దాం…

పాలకొండ డివిజన్ను జిల్లాగా సాధిద్దాం!!

ఊరు వాడా ఒక్కటై, మనసు మాటై

ప్రజా బలమే పునాదై న్యాయం చాటుదాం!                జిల్లా కల మనదే, గళం మనదే,

పాలకొండ పేరు  రాష్ట్రం మొత్తం వినిపిద్దాం!!                      సాధిద్దాం… సాధిద్దాం…

పాలకొండ డివిజన్ను జిల్లాగా సాధిద్దాం!!

ప్రజా గొంతే ప్రజాస్వామ్యం,

న్యాయం మా నినాదం!

కలమెత్తి గళమెత్తి వెలుగెత్తి –

పాలకొండ జిల్లాగా సాధిద్దాం!!

సాధిద్దాం… సాధిద్దాం…

పాలకొండ డివిజన్ను జిల్లాగా సాధిద్దాం!!  .       

                                  ...... కాశిదాస్.....

mana palakonda



Post a Comment

0 Comments