జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ చేత ఫైట్ మాస్టర్ భద్రికి సన్మానం

 పాలకొండ వెబ్ న్యూస్ :  పాలకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. జనసేన శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ బద్రిని శాలువాతో సన్మానించారు. భద్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి “అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి” సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో పవన్ కళ్యాణ్‌తో పరిచయం ఏర్పడి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో తన అనుబంధం దృఢంగా కొనసాగుతోందని భద్రి తెలిపారు. ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కష్టపడే స్వభావం, క్రమశిక్షణ వల్లనే ఎన్నో మందికి ప్రేరణగా మారారని పేర్కొన్నారు. ఆయన స్నేహితుడిగా, సహచరుడిగా ఉన్న భద్రి సినీ రంగంలో మరింత ముందుకు వెళ్లి మంచి కంపోజింగ్‌లతో పేరుప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments