పార్వతీపురం పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్ :పార్వతీపురం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ బత్తిన మోహన్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. నగర నడిబొడ్డులో పేలుడు పదార్థాలు పార్సల్ రూపంలో రావడం అనుమానాస్పదమని, జిల్లా వ్యాప్తంగా మైనింగ్ మాఫియా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తక్షణ సాయం అందించాలని కోరారు. అలాగే కురుపాం మండల గిరిజన పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను కూడా పరామర్శించారు. ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ సమస్యపై స్పందించి, సమస్య పరిష్కారం వరకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా వంగల దాలినాయుడు, కోలా కిరణ్, తీళ్ళ గౌరీశంకర్, సాయి శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. News by: BSS Prasad

Post a Comment

0 Comments