శక్తి టీమ్ అవగాహనా కార్యక్రమం

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండలోని శ్రీ కృష్ణ సాయి జూనియర్ కాలేజీలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల రక్షణకై 'శక్తి యాప్' వినియోగంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఏఎస్ఐ ఝాన్సీ బాయి మాట్లాడుతూ, ఆపదలో తక్షణ సహాయం కొరకు 112కు కాల్ చేయవచ్చని తెలిపారు. సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. బాలల రక్షణకు 1972, సైబర్ క్రైమ్‌కు 1930 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ ప్రకృతాంబ స్వీయ రక్షణ పద్ధతులు నేర్పించారు. శక్తి టీమ్ సభ్యులు పాల్గొన్నారు. News By: BSS Prasad

Post a Comment

0 Comments