పాలకొండ వెబ్ న్యూస్ :తేది: 21-10-2025
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఈరోజు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య విషయాలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, మరియు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
0 Comments