పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పవన్ కళ్యాణ్‌ను కలసి నియోజకవర్గ సమస్యలపై విన్నవింపు

పాలకొండ వెబ్ న్యూస్ – జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి నందు ఈరోజు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  కొణిదెల పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లేఖ రూపంలో వివరించి పరిష్కారానికి విన్నవించారు. ముఖ్యంగా రహదారి అభివృద్ధి, నీటి వనరులు, విద్యా సదుపాయాలు, ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలను ఈ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్  సమగ్రంగా వివరాలు తెలుసుకొని, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.– పాలకొండ వెబ్ న్యూస్

Post a Comment

0 Comments