​పాలకొండను జిల్లా చేయాలి: సాధన సమితి డిమాండ్‌

పాలకొండ వెబ్ న్యూస్ :​పార్వతీపురం మన్యం, 2025 అక్టోబర్ 23.పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, ట్రెజరర్ సబ్బ నానాజీ డిమాండ్ చేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి సమక్షంలో వీరు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పాలకొండకు జిల్లాకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. గతంలో పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను మూడు ముక్కలు చేసి మూడు జిల్లాలలో కలపడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. 

Post a Comment

0 Comments