పాలకొండ జిల్లా సాధనకై రేపు అత్యవసర సమావేశం!

పాలకొండ వెబ్ న్యూస్ (కళాభారతి న్యూస్)         News by : BSS Prasad పాలకొండ, అక్టోబర్ 27:
పాలకొండ జిల్లా సాధన సమితి (Palakonda District Sadhana Samithi) రేపు, మంగళవారం (అక్టోబర్ 28), ఉదయం 10 గంటలకు ఎలైట్ కాలేజీలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజలే తుది నిర్ణేతలుగా నిలబడాలని సమితి నిర్ణయించింది. స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు లేకపోవడంతో, నవంబర్ 7న జరగబోయే ప్రభుత్వ సమావేశానికి ఏ విధంగా సిద్ధం కావాలో దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశం జరుగుతోంది. ప్రజలు, ఉద్యోగులు, మేధావులు హాజరై సూచనలు ఇవ్వాలని సమితి కోరింది. ఈరోజు జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, సబ్బ నానాజీ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments