రైతులు తమ పంటలను వాయుగుండం ప్రభావం నుండి కాపాడుకోవాలంటే అక్టోబర్ 15 లోపల చేతికందే పంటలను వేసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాద్ రావు వివరించిన విధంగా:గురు వారంలో కురిసిన గాలులతో కూడిన వర్షాల కారణంగా స్వల్పకాలిక రకాలైన *MTU 1121, 1382, R&R 15048, కాటన్ డోరా, సన్నాలు* లాంటి వరిలోని మధ్యకాలిక రకాలూ నేలమట్టమయ్యాయి. అదే లక్షీ వారంలో కురిసిన గాలులతో కూడిన వర్షాలు రైతులను తీవ్రంగా వేదించాయి.*అక్టోబర్ 30 తర్వాత, నవంబర్ మొదటి వారంలో అల్పపీడన గాలులతో వర్షాలు కురిస్తే* మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలైన *స్వర్ణ, సాంబ మసూరి, శ్రీకాకుళం సన్నాలు, మటెరు సాంబ* వంటివి నష్టపోతాయి. ఈ రకాలను వేసిన రైతులకు తప్పనిసరిగా నష్టం జరుగుతుంది.
*ఇంకా సమస్యలు:*
- తెగులు, పురుగుల ఉధృతి పెరుగుతోంది.
- మండల వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో లేకపోవడంతో రైతులు పురుగుల మందుల షాప్‌ల నుంచే మందులు కొనుతున్నారు.
- అధికారులు స్పందించకపోవడంతో రైతులు తగిన సలహాలు, సహాయం లేకపోయి నష్టాలను ఎదుర్కొంటున్నారు.
*రైతుల ఆవేదన:*- పత్రికల ద్వారా అధికారులు ప్రశ్నించబడినా చర్యలు కనబడడం లేదు.
- వర్ష దేవుడు కరుణించి తోటపల్లి, యడమ కలువ సాగునీటి తిప్పలు తప్పాయి. పాలకులు వ్యవసాయంపై శ్రద్ధ వహించకపోతే రైతు తీవ్ర నష్టానికి గురయ్యి, ఆహార భద్రత కు నష్టం వాటిల్లుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు మానేసి వ్యవసాయంపై శ్రద్ధ చూపాలని రైతులు కోరుతున్నారు.
ఈ ఆర్టికల్ ప్రిపేర్ చేసిన వారు..ఖండాపు ప్రసాద్ రావు ..PR రాజుపేట.. పాలకొండ మండలం
0 Comments