పాలకొండ వెబ్ న్యూస్ , అక్టోబర్ 19:
పాలకొండ వెబ్ న్యూస్ : వీర ఘట్టం మండలం, బెజ్జి గ్రామం రామ మందిరంలో ప్రతి నెల మూడవ ఆదివారం జరిగిన సత్సంగ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
సభాధ్యక్షులుగా అరటికట్ల కామేశ్వరరావు ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ, భక్తే ముక్తికి మార్గం అని, ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే భక్తిని అలవర్చుకోవాలని తెలిపారు. తద్వారా తల్లిదండ్రులను, సమాజాన్ని, గురువులను గౌరవించే మనస్తత్వం ఏర్పడుతుందని వివరించారు.
అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడును, ధైర్యంతో మనస్సును నిగ్రహించువాడును, శబ్దాస్పర్శాది విషయములను విడిచిపెట్టిన వాడును, రాగద్వేషములను పరిత్యజించినవాడును, ఏకాంత స్థలంలో నివసించువాడును, మితాహారం సేవించువాడును, వాక్కును, శరీరమును, మనస్సును స్వాధీనం చేసుకొనేవాడును, ఎల్లప్పుడూ ధ్యానయోగతత్పరుడై ఉండువాడును భగవంతునికి మిక్కిలి ప్రీతి పాత్రులని పలువురు వక్తలు ప్రవచనం చేశారు. అహంకారం, మమకారం లేనివారు ముక్తికి పాత్రులని, నరుని సేవ నారాయణ సేవ అని, మానవ సేవ మాధవ సేవ అని, దేవుని సేవ అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త కర్రి రామములు, సామంతుల దామోదర్ రావు, గొర్ల దామోదర్ రావు, బొత్స సత్యనారాయణ, జడ్డు జగ్గారావు, గవిడి సన్యాసిరావు, ఎన్వి రమణ ప్రవచనం చేశారు.
ఈ కార్యక్రమానికి వావిలపల్లి సత్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె, అల్లుడు నూతన దంపతులు నారాయణ సేవ అందించారు. News By BSS Prasad
0 Comments