మా ఊరి సీనుగాడి "దీపావళి"

అప్పుడెప్పుడో బాల్యం అచ్ఛం ఇలానే వుండేది...!
గిర్రునా తిరిగే "భూచక్రం" లా..
వెలుగులుచిమ్ముతూ సందడి చేస్తూ....
చివ్వున లేచే "చిచ్చుబుడ్డీలా"..
రివ్వు మంటూ గాలిని చీల్చి
కనుచూపులో మాయమయ్యే
"ఉల్లి పిచ్చుక" లా..
టప్పునపేలిపోయే"తాటిరేకు"లా
చిటపట లాడే" సీమటపాసులా".

 ఊరంతా కోలాహాలం బాణా సంచా అంగళ్ళ జనసందోహం
 సీనుగాడి నిక్కరు జేబులో పదినోటు నిశ్చాళంగా నిద్దరోతుంది... నెలరోజులు గా
ఏమేమి వస్తాయో లెక్కేస్తుంది...
కడకు ఏమీరావని నీరసించింది.!

మునుపటేడే నయం నాన్న డబ్బులేసాడు మనియార్డ్రులో..

ఈ ఏడాది అస్సలు పలుకేలేదు..
సర్లే... సర్లే.. వీధిసివర్లో అంతా  చేరుతాం.. "పల్లీలాట" లో
గంటా రెండు గంటలు "పేక బర్మాలు"  "మన్సులా పటాస్" లు
పోటా పోటీగా జల్లు కొంటాం..!

అప్పుడప్పుడు వొళ్ళు కాలినా
"నాగుల చవితికి" తగ్గిపోతాయి..

మనసు ప్రశాంతంగా వుంది..!
చిల్లులజేబులోమిగిలిన పది నోటులా. పోనిలే వచ్ఛేదీపావళికి  నాన్న డబ్బులు పంపుతాడు...
దీపావళి దూమ్ దాం అనిపిస్తా..!
సీనుగాడుమొకంవెలిగి పోతుంది
"వెన్నముద్ద" మతాబులా....
..... భరత్ భూషణ్ రాజ్ నూతులపాటి
( సామాజిక ఉద్యమనేత, కవి రచయిత, ఉత్తరాంధ్రా)
…......…...........................................................
పాలకొండ వెబ్ న్యూస్:   నాలుగు దశాబ్దాల నాటి క్రితం నాటి సిక్కోలు వలస బాల్యపు దీపావళి జ్ఞాపకాలను ఈ కవిత కళ్ళకు కట్టింది. చిరిగిన జేబులు, చిన్న చిన్న కోరికలు తీరని నిస్సత్తువ ఉన్నా, ఆటల ఆనందంలో వాటిని మరచిపోయే స్వచ్ఛమైన బాల్యాన్ని కవి గుర్తు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆశతో మెరిసిపోయే సీనుగాడి మొహం నేటి బాల్యంలోనూ కనిపిస్తుందంటూ నాటి, నేటి వలస బాల్యపు జీవితాలను పోల్చుతూ హృదయాన్ని కదిలిస్తుంది.
     ..... బి. శివశంకర్ ప్రసాద్

Post a Comment

0 Comments