ధాన్యం కొనుగోలు అనిశ్చితి – రైతుల్లో అయోమయం : అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు


 పాలకొండ వెబ్ న్యూస్ : 06.10.2025 :  వరి సాగు భవిష్యత్తుపై రాష్ట్రంలో పెద్ద చర్చ మొదలైంది. నెల్లూరు జిల్లా సహా పలు ప్రాంతాల్లో రెండు పంటలు వేసిన రైతులు కొనుగోలు జరుగుతుందా అనే అనుమానంలో ఉన్నారు. ఒకే పంట వరి వేసి, రెండో పంటగా నూనె గింజలు, తృణధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనిపై రైతులు అయోమయంలో పడ్డారు అని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు అన్నారు.  వ్యవసాయ నిపుణులు మాత్రం వరికి ప్రత్యామ్నాయం లేదని, రాష్ట్ర వ్యవసాయం వరి లేకుండా నడవదని హెచ్చరిస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే రైతులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు తెలిపారు. మన ధాన్యం తిండికి పనికిరావంటే ఇతర జిల్లాల వ్యాపారస్తులు కొనుగోలు చేయక తక్కువ ధరకు కొంటారు.  ఒక వరి వంగడాన్ని నూతనంగా తయారు చేయడానికి వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలకు  సంవత్సరాలు పడవుతుంది. వారి శ్రమంతా వృథాయేనా. వరి పరిశోధన కేంద్రాలు మూత పడాల్సిందేనా అని ప్రసాద రావు ఆవేదన వ్యక్తం చేశారు. 
https://palakondawebnews.blogspot.com


Post a Comment

0 Comments