పాలకొండ వెబ్ న్యూస్ News by BSS Prasad: పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ సూచనల మేరకు, పాలకొండ మండలం ఎం. సింగుపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మండల పరిషత్ 15^{th} ఫైనాన్స్ నిధులు లక్ష రూపాయలతో చేపట్టిన రిగ్ బోర్వెల్ పనులను మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) బొమ్మాలి భాను సుధాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నిమ్మక దుర్గమ్మ, జనసేన యువ నాయకులు ఆర్‌ఆర్‌ఆర్ రవికుమార్, మాజీ ఎంపీటీసీ రణస్థలం సురప్పలనాయుడు, పొగిరి వెంకటరమణ (పీవీఆర్), మజ్జి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ బోర్వెల్ పనుల ద్వారా గ్రామ ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి.
0 Comments