ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవలు గత నెల రోజులుగా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు విమర్శించారు. సెప్టెంబర్ 24 నుండి ఓపీ సేవలు, అక్టోబర్ 10 నుండి ఎమర్జెన్సీ సేవలు బంద్ కావడంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడం లేదన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ వంటి అత్యవసర సేవలు అందక, జిల్లాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేకపోవడం వల్ల పేదలు విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించేలోపే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఇన్ని రోజులు సేవలు నిలిపివేయడం ఇదే మొదటిసారి అని, ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని దావాల రమణారావు డిమాండ్ చేశారు. BSS Prasad
0 Comments