పాలకొండ వెబ్ న్యూస్ :పాలకొండ పట్టణంలోని 13వ వార్డు పరిధిలో స్థానిక జనసేన యువ నాయకులు కొండదాడి రాజేష్ చొరవ తీసుకొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కొండదాడి రాజేష్ వార్డులోని ఇల్లిల్లూ తిరుగుతూ లబ్ధిదారులకు కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను స్వయంగా అందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన వార్డు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి స్థానిక సమస్యలపై ప్రజలు తమ గోడును వెళ్లబోసు కున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న జనసేన నాయకులు కొండదాడి రాజేష్ వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
0 Comments