అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో మెడికల్ కాలేజ్ నిర్మాణాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, “మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరచితే పేదవాడికి వైద్యం ఎలా అందుతుంది?” అని ప్రశ్నించారు. తన హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, రూ.3 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పనులు నిలిపివేసిందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే కురుపాం గురుకుల విద్యార్థుల మరణంపై రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
0 Comments