పాలకొండ వెబ్ న్యూస్ :
అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ వెంకంపేటలో సోమవారం జరిగాయి. వీవర్స్ కాలనీ సచివాలయ సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.మహిళా హక్కులు, బాల్య వివాహాలు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, రన్నింగ్, షాట్‌పుట్ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలో శ్రావణి, నిరోషా, రాజ్యలక్ష్మి బహుమతులు గెలుచుకోగా, రన్నింగ్‌లో దుర్గా, చాందిని, ప్రీతి, మౌనిషా విజేతలుగా నిలిచారు. షాట్‌పుట్ పోటీలో దుర్గా, చాందిని, మనీషా, మౌనిష, శ్రావణి ప్రథమ స్థానాలు సాధించారు.కార్యక్రమానికి పాలకొండ ఐసిడీఎస్ సిడిపిఓ పి.రంగలక్ష్మి, లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్, సచివాలయం అడ్మిన్ రవిత్రయని, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ప్రమీల పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వి.పుష్పనాదం, ఉపాధ్యాయులు నాగమణి, గౌతమి, ఉదయ బాబు, జీవరత్నం, భాస్కరరావు, గోపి, రాంలాల్, స్వర్ణలత, పరాంకుశం నాయుడు తదితరులు పాల్గొన్నారు. News by .. BSS Prasad
0 Comments