నీటమునిగిన నడుకూరు MPUP పాఠశాల: దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య

కళాభారతి న్యూస్  & పాలకొండ వెబ్ న్యూస్
             NEWS BY: BSS PRASAD

పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం: అక్టోబర్ 29, 2025, నడుకూరు గ్రామంలోని MPUP పాఠశాల గత పది సంవత్సరాలుగా వర్షం కురిస్తే నీట మునుగుతూ విద్యార్థులను, గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత మూడు రోజులుగా (అక్టోబర్ 27, 28, 29) 'ముంత తుఫాన్' కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల ఆవరణ పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ సమస్యపై విద్యార్థులు, గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల ద్వారా అధికారులకు, ఎంపీడీఓకు, గతంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు విన్నవించినా పరిష్కారం లభించలేదు. గతంలో నాటి జేసీ సుమిత్ కుమార్  పాఠశాలను పరిశీలించి, ప్రధాన రహదారి ప్రక్కన కాల్వ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. 


Post a Comment

0 Comments