శ్రీ కోదండరామ ఆలయం అభివృద్ధికి టీడీపీ అధ్యక్షులు గంటా సంతోష్ విరాళం

 పాలకొండ వెబ్ న్యూస్ (Palakonda Web News)పాలకొండ పట్టణంలోని ముదునూరువారి వీధిలో ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆలయం అభివృద్ధి పనులకు పాలకొండ టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంటా సంతోష్ తన వంతు సహాయంగా రూ. 50,000 (యాభై వేల రూపాయలు) విరాళాన్ని అందించారు. 

పాలకొండ వెబ్ న్యూస్
పాలకొండ వెబ్ న్యూస్ 
ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  గంటా సంతోష్ ఆలయ కమిటీ సభ్యులను కలిసి రూ. 50,000 నగదును అందజేశారు. దేవుని పట్ల, ఆలయం పట్ల తనకు ఉన్న భక్తిని చాటుకుంటూ ఆలయ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి ఉదారంగా విరాళం అందించిన గంటా సంతోష్ కి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సహకారం ఆలయ పనులను మరింత వేగవంతం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments