పరీక్షల షెడ్యూల్ వివరాలు:
మార్చి 16న మొదటి భాష కాంపొజిట్ తెలుగు పేపర్-1తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మార్చి 18న రెండో భాష, మార్చి 20న ఆంగ్లం, మార్చి 23న గణితం పరీక్షలు జరుగుతాయి. మార్చి 25న భౌతిక, రసాయనశాస్త్రం పేపర్‌కు, మార్చి 28న జీవశాస్త్రానికి పరీక్షలు ఉంటాయి. మార్చి 30న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించబడుతుంది. చివరి రోజుల్లో, మార్చి 31న కాంపొజిట్ తెలుగు పేపర్-2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పార్శి) పేపర్–1 జరుగుతాయి. చివరగా, ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పార్శి) పేపర్–2 మరియు ఎస్ఎస్సీ వృత్తివిద్య కోర్సు థియరీ పరీక్షలతో ఈ పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయి.
0 Comments