పాలకొండ : భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రాజ్యాంగ గొప్పదనాన్ని, దాని విలువలను యువతకు తెలియజేసేలా ఈ కార్యక్రమాలు సాగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీఠిక పఠనం : పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో నిర్వహించిన వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ వి. హరగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాల అలంకరించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం, విద్యార్థులందరి చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26 ప్రాధాన్యతను, రాజ్యాంగం ఏర్పడడానికి గల కారణాలను విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. యువత రాజ్యాంగ విలువలను తప్పక పాటించాలని, దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పైలా శంకర్రావు, గోవిందరావు, విజయ్ కుమార్ నాయుడు, గిరిబాబు తదితరులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


0 Comments